తిరుమల కొండలపై తరచూ ఎగురుతున్న విమానాలు ఈ మధ్యకాలంలో సర్వ సాధారణమైంది. ఏకంగా శ్రీవారి ఆలయం సమీపంలోనే విమానాల రాకపోకలు సాగించడం భక్తుల కంటపడుతోంది. తిరుమల హిల్స్ నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలన్న డిమాండ్ కూడా ఎప్పటినుంచో వినిపిస్తోంది.