ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు భారీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. 130 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చుతో ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రచారం నిర్వహించబడుతుంది.