కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి ఈ ఏడాది మండల మకరవిళక్కు సీజన్లో తొలి 15 రోజుల్లో రూ.92 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 33.33% వృద్ధిని సూచిస్తోంది. ప్రసాదం విక్రయాలు, హుండీ ద్వారా ఈ ఆదాయం గణనీయంగా పెరిగింది. దాదాపు 13 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు.