కేరళలో మెదడువాపు వ్యాధి విజృంభణ దృష్ట్యా, శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు రాష్ట్ర ఆరోగ్య శాఖ కీలక ఆరోగ్య సూచనలు జారీ చేసింది. మందులు కొనసాగించడం, నదుల్లో స్నానం చేసేటప్పుడు జాగ్రత్త, పరిశుభ్రత పాటించడం, గోరువెచ్చని నీరు తాగడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసర సేవలకు హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంది.