శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు తీపికబురు. ఇకపై అయ్యప్ప భక్తులు తాము ప్రయాణించే విమానాల్లో తమతో పాటు ఇరుముడిని కూడా తీసుకెళ్లెచ్చు. భక్తుల భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని ఆ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.