శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు రికార్డు స్థాయిలో తరలివస్తున్నారు. కేవలం 12 రోజుల్లోనే 10,29,451 మంది అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. గంటగంటకీ భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో దర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఈ సీజన్లో భక్తుల సంఖ్య పది లక్షలు దాటడం విశేషం.