భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకోవడంతో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. స్వదేశంలో ప్రపంచ కప్ కోల్పోయిన బాధ తెలిసిన రోహిత్, నవంబర్ 2న నవీ ముంబైలో ప్లేయర్లు సంబరాలు చేసుకుంటుండగా కంటతడి పెట్టారు. భారత్ విశ్వ విజేతగా నిలవడంతో హిట్ మ్యాన్ తన ఎమోషన్స్ ను అదుపు చేసుకోలేకపోయారు.