'కాంతార' జర్నీ ఎండ్స్ అని చెబుతూనే కాంతర జర్నీ బిగిన్స్ అని వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. రోజూ వేలాది మందితో షూటింగ్ చేసినట్టు తెలిపారు. 250 రోజులు.. మూడేళ్ల పాటు టీమ్ పడ్డ కష్టాన్ని ఈ ఏడాది అక్టోబర్ 2న ప్రేక్షకులు స్క్రీన్ మీద చూడొచ్చని చెప్పారు రిషబ్ శెట్టి. 'కాంతార' మూవీకి ప్రీక్వెల్‌గా సిద్ధమవుతోంది 'కాంతార చాప్టర్ 1'.