నిర్మల్ జిల్లా బైన్సా ఏరియా ఆస్పత్రిలో 15 ఏళ్లు పనిచేసిన పారిశుద్ధ్య కార్మికురాలు చంద్రబాయికి ఆస్పత్రి సిబ్బంది ఘనమైన వీడ్కోలు పలికారు. ఆమె రిటైర్మెంట్ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది ఘనంగా సన్మానం చేశారు. శాలువా కప్పడం, పాదపూజ చేయడం, నగదు సహాయం చేయడం వంటి కార్యక్రమాలతో ఆమెకు వీడ్కోలు పలికారు.