గాంధీ జయంతి కారణంగా వైన్ షాపుల మూసివేత నేపథ్యంలో.. ముందురోజే దసరా పండుగను పురస్కరించుకుని మద్యం వినియోగదారులు ముందుగానే కొనుగోళ్లు చేశారు. దీనివల్ల రూ. 790 కోట్ల విలువైన మద్యం అమ్ముడై, గత ఏడాది కంటే 7 శాతం అధిక ఆదాయం వచ్చింది. ఈ క్రెడిట్ వినియోగదారులతో పాటు ఆబ్కారీ శాఖకు, డిస్ట్రిబ్యూటర్లకు కూడా దక్కుతుంది.