గుండెపోటు అకస్మాత్తుగా రాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజుల ముందు శరీరం హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. భుజాలు, చేతులు, వీపు నొప్పి, చల్లని చెమటలు, అలసట, గుండె మంట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఈ లక్షణాలను విస్మరించకూడదు.