రియాలిటీ షో డ్యాన్సర్ సుధీంద్ర కొత్త కారు కొని, సోదరుడిని చూసేందుకు బెంగళూరు శివారుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా కారు సమస్యతో హైవే పక్కన నిలిపారు. అదే సమయంలో వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ట్రక్కు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లు పోలీసులకు తెలిపాడు.