ఆర్బీఐ 50 పైసల నాణేలు చెల్లుబాటుపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించింది. 50 పైసల నుండి ఒకటి, రెండు, ఐదు, 10, 20 రూపాయల నాణేలన్నీ చట్టబద్ధ కరెన్సీ అని స్పష్టం చేసింది. తప్పుడు సమాచారం నమ్మవద్దని, వ్యాపారులు నాణేలు తీసుకోవాలని కోరింది. అపోహలను నివృత్తి చేయడానికి వాట్సాప్ మెసేజ్లు పంపుతోంది.