మహారాష్ట్రలోని నాలాసోపారలో బిర్యానీ బియ్యంలో ఎలుక కనిపించిన వీడియో తీవ్ర కలకలం రేపింది. తబేలా చాయ్ జమ్జమ్ బిర్యానీ సెంటర్లో జరిగిన ఈ ఘటన వినియోగదారుల ఆరోగ్య భద్రతపై ఆందోళనలను పెంచింది. ఈ వైరల్ వీడియోపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డిఎ) తక్షణమే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.