యానాం పుష్కర ఘాట్ వద్ద మత్స్యకారులకు ఈ ఏడాది తొలి పులుసు చేప దొరికింది. కేజీకి పైగా బరువున్న ఈ చేపను రూ. 18,000కి ధరణి అనే మత్స్యకారిణి కొనుగోలు చేసింది. గోదావరిలో వరద నీరు వచ్చినప్పుడు సముద్రం నుండి వచ్చే ఈ చేపల సంఖ్య తగ్గుతోందని, వచ్చే రెండు నెలల్లో పులుసులు విరివిగా దొరుకుతాయని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేశారు.