ఎన్టీఆర్ జిల్లాలోని తక్కెళ్లపాడులో రైతు ముత్యాల రజిత రమేశ్ పొలంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. రెండు మిరప మొక్కలకు మిరపకాయలతో పాటు వంకాయలు, టమాటాలు కూడా కాశాయి. ఇది స్థానికులను ఆశ్చర్యపరచగా, వ్యవసాయ అధికారులు ఇది జెనెటిక్ మిక్సింగ్ లేదా గ్రీఫ్టింగ్ వల్ల జరిగి ఉండవచ్చని, ఈ మూడు సొలనేసి కుటుంబానికి చెందినవని వివరించారు.