కరీంనగర్ సమీపంలోని ఎల్ఎండి డ్యామ్ వద్ద అరుదైన నారాయణ పక్షి (ఆర్డియా సినిరియా) కనిపించింది. ఈ పక్షి నల్లని మరియు బూడిద రంగు రెక్కలను కలిగి ఉంది. పొడవాటి కాళ్ళు మరియు ముక్కు దీని ప్రత్యేకత. యూరప్, ఆసియా, ఆఫ్రికాలో ఎక్కువగా కనిపించే ఈ పక్షి చిత్తడినేలలు, నదులు, సరస్సుల వద్ద నివసిస్తుంది అని కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ పీజీ కళాశాల జంతుశాస్త్ర విభాగ అధిపతి కిరణ్ మయ్య తెలిపారు.