రామాయణ సినిమా ఆడియన్స్‌ను మెప్పించలేకపోతే అది మేకర్స్‌గా తమ ఫెయిల్యూరే అన్నారు నిర్మాత నమిత్ మల్హోత్రా. పౌరాణిక కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను అవతార్, గ్లాడియేటర్ సినిమాల స్థాయిలో రూపొందిస్తున్నామని, ఈ సినిమా ద్వారా రామాయణాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాలన్నదే తమ ఆశయం అన్నారు. రామాయణ తొలి భాగం 2026కి దీపావళి రిలీజ్ కానుంది.