ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన అందరినీ కలవరపరిచింది. ఇది ఉగ్రచర్యగా కేంద్రం ప్రకటించింది. ఈ ప్రాంతంలోనే రామ్ చరణ్ పెద్ది మూవీ టీమ్ ఈ నెల 15, 16 తేదీల్లో షూటింగ్ చేయడానికి అనుమతి తీసుకుంది. ఈ దాడితో షూటింగ్ వాయిదా పడింది. ప్రమాదం నుంచి కొద్దిలో తప్పించుకోవడంతో టీమ్ షాక్‌కి గురయ్యారు.