Peddi Movie - Chikiri Chikiri Song: రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన 'పెద్ది' చిత్రం నుండి 'చికిరి చికిరి' పాట దేశ విదేశాల్లో వైరల్గా మారింది. సోషల్ మీడియాలో ఎంతోమంది ఈ పాటకు డ్యాన్స్ చేసి వీడియోలు పంచుకుంటున్నారు. తాజాగా ఓ బామ్మ డ్యాన్స్ వీడియో సంచలనం సృష్టించింది. ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ పాట 'పెద్ది' సినిమా విజయంపై ఆశలు రేపుతోంది. మార్చి 27న సినిమా విడుదల కానుంది.