కొంతకాలంగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటూవస్తున్న రాజేంద్రప్రసాద్.. తాజాగా తాను చేసిన ఓ పనితో మరో సారి విమర్శల పాలవుతున్నాడు. తాజాగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి వెళ్లిన రాజేంద్ర ప్రసాద్... ఆ పెళ్లిలో తన దగ్గరికి సెల్ఫీ కోసం వచ్చిన ఓ కుర్రాడిని అసహనంతో పక్కకు తోసేశాడు.