నేటి కాలుష్యం, జీవనశైలి కారణంగా యువత చిన్నవయసులోనే కిడ్నీ, గుండె, కాలేయ సమస్యలను ఎదుర్కొంటున్నారు. పునర్నవ (తెల్లగలిజేరు) మొక్క ఈ సమస్యలకు ఆయుర్వేద పరిష్కారాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది అవయవాలను పునరుజ్జీవింపజేసి, నొప్పులు తగ్గించి, రక్తాన్ని శుద్ధి చేసి, కంటి చూపు, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.