వికారాబాద్ జిల్లా పరిగిలోని తహశీల్దార్ ఆనందరావుని బదిలీ చేయడంతో ప్రజలు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆ అధికారిని బదిలీ చేయడమే జనం సంతోషానికి కారణం. ప్రజా సంఘాల నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిగి, ఆనందరావుని బదిలీ చేశారు.