ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఇద్దరు కేటుగాళ్లు గోల్డ్ షాపు యజమానిని మోసగించారు. వెల్లంపల్లి గ్రామస్తులమని నమ్మించి, నకిలీ బంగారు బ్రాస్లెట్ను తాకట్టు పెట్టి రూ.50,000 నగదు తీసుకున్నారు. వ్యాపారి మోసం గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది.