ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాలు పదేపదే వాయిదా పడుతుండటంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ చిత్రం కూడా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మార్చి 5న టీ-సిరీస్ నుండి మరో చిత్రం వస్తుండడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ విషయంపై అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజున స్పష్టత వచ్చే అవకాశం ఉంది.