ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న సినిమా రాజా సాబ్. ఈ చిత్రం వాయిదా పడుతుందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత టిజి విశ్వప్రసాద్. సినిమాను డిసెంబర్ 5న విడుదల చేయాలని మేం చూస్తున్నామని.. కానీ అభిమానుల నుంచి, బిజినెస్ సర్కిల్స్ నుంచి మాత్రం సంక్రాంతికి రమ్మని చెప్తున్నారని చెప్పారు విశ్వప్రసాద్.