మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.2500 అందజేస్తున్నారని వచ్చిన తప్పుడు సమాచారం వల్ల తెలంగాణ వికారాబాద్లో పోస్టాఫీసుల ముందు జనం పెద్ద ఎత్తున క్యూలు కట్టారు. ఖాతా లేని వారు కొత్త ఖాతాలు తెరుచుకుంటుండగా, ఖాతా ఉన్నవారు డబ్బులు వస్తాయని పోస్టాఫీసులకు వస్తున్నారు. ఈ పుకార్లు వాట్సాప్ ద్వారా వ్యాపించాయని తెలుస్తోంది.