ఉత్తరప్రదేశ్లోని దురి గ్రామంలో 90 లక్షల రూపాయలతో నిర్మించిన కొత్త రోడ్డు త్వరగానే పాడైపోయింది. ఒక వ్యక్తి తన వట్టి చేతులతో రోడ్డుపై తారును పీకిపడేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రోడ్డు నిర్మాణంలో తక్కువ నాణ్యమైన వస్తువులను ఉపయోగించారని, ముందుగానే కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం వీడియో షేర్ చేసిన వ్యక్తిపైనే కేసు పెట్టాలని చూస్తున్నారట.