దానిమ్మ పండులో విటమిన్ సి, కె, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రోజూ దానిమ్మ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు బలపడతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇది రక్తహీనతను నివారిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.