నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లపుర్లో వృద్ధ రైతుపై ఓ పోలీసు అధికారి దౌర్జన్యం చేసిన ఘటన వైరల్గా మారింది. భూమికి సంబంధించిన సమస్యతో రెవెన్యూ శాఖకు వెళ్లిన రైతుపై ఏఎస్ఐ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.