ప్రధాని మోడీ మే 2న ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు పాల్గొననున్నారు. ప్రభుత్వం ఐదు లక్షల మందికి పైగా హాజరు అవుతారని అంచనా వేసింది. ఈ పర్యటన ఏర్పాట్లకు ప్రత్యేక మంత్రుల కమిటీని కూడా నియమించారు.