అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనా స్థలిని ప్రధాని మోదీ శుక్రవారంనాడు నేరుగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుతెన్నుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మృత్యుంజయుడు, ఇతర మెడికోలను పరామర్శించారు.