సింధూ జలాలపై సంపూర్ణ అధికారం భారత్‌కే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్నారు. దీనిపై భారత రైతులకే అధికారం ఉందన్నారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకను మోదీ ఎగురవేశారు.