పిస్తా పప్పును రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు 30 గ్రాములు (సుమారు 20-25 పప్పులు) తినడం వల్ల విటమిన్ బి6, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. శాఖాహారులకు ఇది మంచి ప్రోటీన్ మూలం కూడా.