నెల్లూరు జిల్లాలోని ఒక పెట్రోల్ బంకులో రూ.400లకు పెట్రోల్ కొట్టిస్తే.. కేవలం అర లీటరు పెట్రోల్ మాత్రమే ఇచ్చినట్లు ఒక వ్యక్తి ఆరోపించాడు. బండి ఆగిపోవడంతో ట్యాంకు చెక్ చేసినప్పుడు ఈ మోసం బయటపడింది. బంకు యజమానులు వివరణ ఇవ్వకుండా తప్పించుకున్నారని తెలిసింది. ఇలాంటి మోసాలను నివారించడానికి తూనికలు, కొలతలు శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ వస్తున్నాయి.