మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో 150కి పైగా స్థానాల్లో వైసీపీని గెలిపించిన ఏపీ ప్రజలే.. 2029లో 175 స్థానాల్లో వైసీపీని గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు. ఆరు నెలల తర్వాత వైసీపీ జెండా మోసే వారు తిరగపడుతారని కూటమి పార్టీలకు హెచ్చరించారు. అప్పుడు కూటమి పార్టీల వారు చెట్టుకొకరు.. పుట్టకొకరు వెళ్లాల్సి ఉంటుందన్నారు.