ఏపీలో ప్రభుత్వ యంత్రాంగమంతా నారా లోకేష్ డైరెక్షన్లోనే నడుస్తోందని వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు నాయుడు కేవలం తెర ముందు మాత్రమే ఉన్నారని అన్నారు. తెర వెనుక అంతా నడిపిస్తున్నది ఆయన తనయుడు నారా లోకేషే అన్నారు.