నోయిడాలో రూ.1.5 కోట్ల విలువైన అపార్ట్ మెంట్ గోడను పెన్సిల్ సులభంగా చీల్చిందని ఓ యజమాని పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. మొదట డ్రిల్ అనుకున్నా, పెన్సిల్ తోనే రంధ్రం అయిందని చెప్పాడు. హైరైజ్ భవనాల్లో భూకంపాల నుండి రక్షణకు వాడే ఆటోక్లేవ్డ్ ఏరేటెడ్ కాంక్రీట్ (AAC) వల్ల ఇది జరిగిందని ఓ నెటిజన్ వివరించాడు. ఇది సాంప్రదాయ గోడల వంటిది కాదని పేర్కొన్నాడు.