వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక సమస్యలపై స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. పిఠాపురం అత్యాచారం, దళితులపై దాడులు, మహిళలపై హింస వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ మౌనం సహించదగినది కాదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడికి నష్టం వచ్చినప్పుడే పవన్ బయటకు వస్తారని ఆరోపిస్తూ, రాజకీయాల కోసం ధర్మాన్ని వాడుకోవద్దని హెచ్చరించారు.