పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లోనే వేగంగా జరుగుతుంది. తాజాగా ఈ చిత్ర అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు సందర్భంగా డైలాగ్ టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.