కాకినాడ పోర్టు మీదుగా అక్రమ బియ్యం రవాణాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలకు అక్రమంగా బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్ లో 1064 టన్నుల బియ్యం సంచులను స్వయంగా పరిశీలించారు.