పాపం! పవన్ హరి హర వీర మల్లు సినిమాకు ఇప్పుడు చెప్పుకోలేని కష్టం వచ్చిందని ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తోంది. క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా.. రీసెంట్గా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. జులై 24న వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. దీంతో ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్‌ను క్లోజ్ చేసే పని పెట్టుకున్నారు ప్రొడ్యూసర్ రత్నం.