అల్లూరి జిల్లా అరకులోయ ప్రభుత్వ ఆసుపత్రిలో తెల్లవారుజామున రోగుల ఫోన్లు చోరీకి గురయ్యాయి. గాఢ నిద్రలో ఉన్న రోగుల వార్డులోకి ఓ ముసుగు వ్యక్తి చొరబడి సెల్ఫోన్లు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు కాగా, పోలీసులు దొంగను గుర్తించే పనిలో ఉన్నారు. ఇది భద్రతా వైఫల్యమేనని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.