పన్నీరులో ప్రోటీన్లు, మంచి కొవ్వులు, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. విటమిన్ బి12, డి, ఎ వంటి విటమిన్లు కూడా పన్నీరులో సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మెదడు, నాడీ వ్యవస్థ, ఎముకలు, కంటి చూపు, రోగ నిరోధక శక్తిని బలపరుస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలికి పన్నీరును ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం.