పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన పార్టీ పాకిస్తాన్ తెహరీక్ ఎ ఇన్సాఫ్ తీవ్రంగా ఖండించింది. ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని, రావల్పిండిలోని అదియాలా జైలులో క్షేమంగా ఉన్నారని పీటీఐ సెనేటర్ కుర్రం జీషన్ స్పష్టం చేశారు. ఆయనకు యువతలో బలమైన మద్దతు ఉంది.