పాకిస్థాన్ సెల్ఫ్ డబ్బా మరీ మితిమీరిపోయింది. ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్, మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ భారత్‌పై యుద్ధంలో విజయం సాధించామని ప్రకటించుకున్నారు. కరాచీలో విజయోత్సవ ర్యాలీలు జరిగాయి. నవ్విపోదురు కాక నాకేంటి అన్నట్లు.. యుద్ధంలో భారత్‌ను మట్టి కరిపించినట్లు వారు సొంత డబ్బా కొట్టుకుంటున్నారు.