జమ్ముకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని మోడీ అత్యవసర సమీక్ష నిర్వహించారు. సౌదీ అరేబియా పర్యటనను ముగించుకొని తిరిగి వచ్చిన ప్రధాని, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. జమ్ముకశ్మీర్ లో హై అలర్ట్ ప్రకటించి, భద్రతా దళాలు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి.