Green camphor Benefits: పచ్చ కర్పూరం కేవలం పూజలకే కాదు, ఆయుర్వేదంలో అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగానూ ఉపయోగపడుతుంది. ఆస్తమా, గాయాలు, జలుబు, తలనొప్పి, శరీర వేడిని తగ్గించడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. శ్వాసను మెరుగుపరచడం నుండి వికారం, చెమటలు పట్టడం వంటి సమస్యలను నివారించడం వరకు పచ్చ కర్పూరం సహజసిద్ధమైన ఔషధ గుణాలను కలిగి ఉంది.