టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియమితులయ్యారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా సేవలందించిన ఆయన.. ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వంలో 25 ఏళ్లు శాసనసభలో కొనసాగారు. 2014లో పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈ నియామకం ఆయన రాజకీయ జీవితంలో మరో మైలురాయి.