గర్భిణీలు నారింజ పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉండే నారింజ ఇమ్యూనిటీని పెంచి, శిశువు మెదడు ఎదుగుదలకు తోడ్పడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అయితే, రోజుకు ఒకటి లేదా రెండు నారింజ పండ్లకు మించి తినకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు.